ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం

ABN , First Publish Date - 2021-12-08T05:25:23+05:30 IST

అమలాపురం మండలం ఎ.వేమవరం గ్రామంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం ఉంది.

ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం
ఎ.వేమవరంలో అతిపెద్ద శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం

  నేడు సుబ్రహ్మణ్యేశ్వరుని కల్యాణం
అమలాపురం రూరల్‌, డిసెంబరు 7:  అమలాపురం మండలం ఎ.వేమవరం గ్రామంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం ఉంది. జగమంతా పూజలందుకుంటున్న శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ప్రపంచంలో రెండుచోట్ల మాత్రమే అతిపెద్ద విగ్రహాలు ఉన్నాయి. మలేసియాలో ప్రతిష్టించిన విగ్రహం కంటే ఎత్తుగా 42 అడుగుల స్కంధుని విగ్రహం ఎ.వేమవరంలో మాత్రమే ఉంది. రక్షణ పడగగా 45 అడుగుల నాగరాజు నిలబడి ఉండటం మరో ప్రత్యేకత. అమలాపురంలో ప్రసిద్ధినొందిన శ్రీకృష్ణేశ్వర, శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న శ్రీయేడిది సత్యనారాయణ కల్యాణ మండపం ప్రాంగణంలో 40 అడుగుల అతిపెద్ద కార్తికేయుని విగ్రహం ఉంది.  అమలాపురం ఎన్టీఆర్‌ మార్గ్‌లో పార్కులో అతిపెద్ద స్కంధుని విగ్రహం పొదలమాటు నుంచి భక్తులకు దర్శనమిస్తుంది.

Updated Date - 2021-12-08T05:25:23+05:30 IST