సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం నేడు

ABN , First Publish Date - 2021-08-02T06:26:26+05:30 IST

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం నేడు

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం నేడు

గవర్నర్‌పేట, ఆగస్టు 1: ఆషాఢ మాసం కృత్తికా నక్షత్రం సందర్భంగా సోమవారం చల్లపల్లి బంగ్లా సమీపంలోని కాశీవిశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానంలో గోనుగుంట వేంకట రామారావు-సుజాత సౌజన్యంతో  వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర కలశ పూజా పూర్వక మహాభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో నూతక్కి వెంకట సాంబశివరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తుల నుంచి ఎటువంటి పూజా ద్రవ్యములు, విరాళాలు స్వీకరించబోమని తెలిపారు. భక్తులు ఈ మహత్తర కార్యక్రమాన్ని దర్శించి స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు.

Updated Date - 2021-08-02T06:26:26+05:30 IST