Abn logo
Jul 9 2020 @ 05:50AM

డంబ్లింగ్‌ ఆవరణంలోనూ పరిశుభ్రత పాటించాలి

రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసిన ఏడీఆర్‌ఎం


ఖమ్మం మామిళ్లగూడెం, జూలై 8: డంబ్లింగ్‌ ఆవరణంలోనూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని  సికింద్రాబాద్‌ డివిజన్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ సుబ్రహ్మణ్యం రైల్వే అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఖమ్మం రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌ ఆవరణాలను ప్లాట్‌ఫారాలను పరిశీలించారు. పరిశుభ్రత విషయమై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పశ్చిమ భాగంలో హమాలీల విశ్రాంతి గదుల నిర్మాణాలను ఏడీఆర్‌ఎం పరిశీలించారు. హమాలీలతో మాట్లాడారు. డంబ్లింగ్‌ ప్లాట్‌ఫారాలకు, ట్రాక్‌కు మధ్యన దుమ్ముదూళి లేవడాన్ని గమనించారు.  పరిశుభ్రతను పాటించాలంటూ సూచించారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం వెంట సీనియర్‌ డీఈఎన్‌ యోగానంద్‌, ఐవోడబ్ల్యూ ద్రోణాచార్య, అవినాష్‌, సీబీఎస్సార్‌ రవిచంద్ర, జేఈ టీ. శ్రీనివా్‌సచౌదరి, ఎస్‌ఎ్‌సఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement