Abn logo
Sep 26 2021 @ 00:28AM

పొగాకు ఎగుమతులు పెంచేందుక చర్యలు

కేంద్ర ప్రభుత్వ ఈ-కామర్స్‌ కార్యదర్శి బీవీఆర్‌ సుబ్రహ్మణ్యంతో సమావేశమైన కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, పొగాకు బోర్డు ఈడీ శ్రీధర్‌బాబు

కేంద్రప్రభుత్వ ఈ కామర్స్‌ కార్యదర్శి సుబ్రహ్మణ్యం

గుంటూరు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):  పొగాకు విదేశీ ఎగుమతులు పెంచటానికి కేంద్రప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు కేంద్ర ఈ కామర్స్‌ కార్యదర్శి బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు.  వాణిజ్య ఉత్సవ్‌లో భాగంగా పొగాకుబోర్డు కార్యాలయంలో శనివారం రైతులు, వ్యాపారులు, చైర్మన్లతో  ఆయన సమీక్షించారు. ఈఏడాది రూ.40 వేలకోట్లు ఎగుమతులు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. సమావేశంలో ఈడీ అద్దంకి శ్రీధరబాబు, పొగాకు బోర్డు చైర్మన యడ్లపాటి రఘునాఽథబాబు, వైస్‌చైర్మన కె.వాసుదేవరావు, మాజీ వైస్‌చైర్మన కొండారెడ్డి, ఐటీఏ అధ్యక్షుడు మద్ది వెంకటేశ్వరరావు, కేంద్ర ప్రభుత్వ కామర్స్‌ జాయింట్‌ సెక్రటరి దివాకర్‌నాథ్‌ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.


కేంద్ర ఈ-కామర్స్‌ కార్యదర్శితో కలెక్టర్‌ భేటీ


 కేంద్ర ప్రభుత్వ ఈ-కామర్స్‌ కార్యదర్శి బీవీఆర్‌ సుబ్రహ్మణ్యంతో జిల్లా కలెక్టర్‌ సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. శనివారం గుంటూరు నగరానికి వచ్చిన సుబ్రహ్మణ్యంని నగరంలోని ఒక హోటల్‌లో కలెక్టర్‌ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పొగాకు బోర్డు ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబు, ఈ-కామర్స్‌ జాయింట్‌ సెక్రెటరీ దివాకర్‌నాథ్‌ మిశాల్రు సమావేశమయ్యారు. జిల్లా ప్రగతిని కలెక్టర్‌ ఈ సందర్భంగా వారికి వివరించారు. వివిధ రంగాల్లో గుంటూరు జిల్లాని అగ్రస్థానంలో నిలుపుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రసాద్‌ పాల్గొన్నారు.