కొత్తగా 11 సబ్‌రిజిస్ట్రార్‌ భవనాలు

ABN , First Publish Date - 2021-12-08T16:36:59+05:30 IST

రాష్ట్ర వాణిజ్య పన్నుల విభాగం, పత్రాల రిజిస్ట్రేషన్‌ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రూ.14.27 కోట్లతో నిర్మించిన 11 కొత్త సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ భవనాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మంగళవారం ఉదయం ప్రారంభించారు. సచివాలయంలో జరిగిన ప్రత్యేక

కొత్తగా 11 సబ్‌రిజిస్ట్రార్‌ భవనాలు

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించిన సీఎం 

చెన్నై: రాష్ట్ర వాణిజ్య పన్నుల విభాగం, పత్రాల రిజిస్ట్రేషన్‌ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రూ.14.27 కోట్లతో నిర్మించిన 11 కొత్త సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ భవనాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మంగళవారం ఉదయం ప్రారంభించారు. సచివాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో చెన్నై, మదురై, కడలూరు, తిరునల్వేలి, వేలూరు, తంజా వూరు, తిరుచ్చి జోన్లలో నిర్మించిన వాటితో పాటు విరుదాచలంలో ఉమ్మడి రిజిస్ట్రేషన్‌ కార్యాలయ భవనానికి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారం భోత్స వం చేశారు. చెన్నై జోన్‌లో రూ.1.90 కోట్లతో తాంబరం - సేలయూరు ఉమ్మడి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం భవనం, రూ94.40లక్షలతో  ఆలందూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం, రూ.1.72 కోట్లతో సాలవాక్కంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం నిర్మించారు. కాగా రిజిస్ట్రేషన్‌ శాఖలో విధి నిర్వహణలో మృతి చెందిన 15 మంది ఉద్యోగుల వారసులకు కారుణ్య ప్రాతిపదికన ముఖ్య మంత్రి స్టాలిన్‌ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్య క్రమాల్లో వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్‌ శాఖల మంత్రి పి.మూర్తి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, వాణిజ్యపన్నుల శాఖ కార్యదర్శి పి.జ్యోతి నిర్మలసామి, రిజిస్ట్రేషన్‌ శాఖ అధ్యక్షుడు ఎంపీ శివన్‌ అరుళ్‌ తదితరులు పాల్గొన్నారు.


ముడిచ్చూరులో మళ్ళీ పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ వరద తాకిడికి గురైన వరదరాజపురం, ముడిచ్చూరు ప్రాంతాల్లో రెండో మారు పర్యటించారు. పదిరోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఆ రెండు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్‌ అధికారులతో కలిసి ఇటీవల వరదరాజపురం, పీటీసీ కాలనీ, మహాలక్ష్మినగర్‌, ఇరుంబులియూరు ప్రాంతాల్లో పరిశీలిం చారు. వాననీటి తొలగింపునకు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక అధి కారులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో స్టాలిన్‌ మంగళవారం ఉదయం మళ్ళీ పర్యటించారు. వాననీటి తొలగింపు పనులను తనిఖీ చేశారు. మంత్రి దామో అన్బరసన్‌, శాసనసభ్యుడు ఎస్‌ఆర్‌ రాజా, ప్రత్యేక అధికారి అముదా, కాంచీపురం జిల్లా కలెక్టర్‌ రాహుల్‌నాఽథ్‌ తదితరులు ముఖ్యమంత్రి వెంట పర్యటించారు.

Updated Date - 2021-12-08T16:36:59+05:30 IST