వ్యవసాయ ఉత్పత్తులకు రాయితీలు కల్పించాలి

ABN , First Publish Date - 2020-06-06T10:26:21+05:30 IST

వ్యవసాయ ఉత్పత్తులకు రాయితీలతో పా టు మద్దతు ధరను కల్పించాలని ఎమ్మెల్సీ టి.జీవన్‌

వ్యవసాయ ఉత్పత్తులకు రాయితీలు కల్పించాలి

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి


జగిత్యాల, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ ఉత్పత్తులకు రాయితీలతో పా టు మద్దతు ధరను కల్పించాలని ఎమ్మెల్సీ టి.జీవన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం జ గిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రై తులు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేస్తారన్నారు. పత్తి పంట సాగు చేయాలని చెబుతున్న ప్రభుత్వం ప్రైవేట్‌ కంపెనీలకే విత్తనాల ధరను వదిలేసిందని ఆరోపించారు. ప్రభుత్వం వరి పంటకు మద్దతు ధరను కేవలం 3 శాతం మేరకే పెంచిందని, కనీసం 10 శాతం పెంచితే రైతుకు గిట్టుబాటు అయ్యే దని అన్నారు. సన్న రకం వరిధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర రూ.2500 ఇవ్వ డంతో పాటు పేదలకు రేషన్‌ కార్డు ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తే తాను కూడా కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తానన్నారు. ఈ విధానం ద్వారా అ టు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు చేకూరుతుందని సూచించారు. ఈ సమావేశంలో గిరి నాగభూషణం, బండ శంకర్‌, కొత్త మోహన్‌, కల్లేపెల్లి దు ర్గయ్య, దేవేందర్‌ రెడ్డి, గాజుల రాజేందర్‌, భాస్కర్‌ రెడ్డి, అశోక్‌, రాము, మహేష్‌, మున్నా పాల్గొన్నారు.

Updated Date - 2020-06-06T10:26:21+05:30 IST