ఉద్యాన అభివృద్ధి పథకం ద్వారా రైతులకు రాయితీలు

ABN , First Publish Date - 2020-09-19T05:30:00+05:30 IST

సమీకృత ఉద్యానశాఖ అభివృద్ధి మిష న్‌ ద్వారా ప్రభుత్వం ఉద్యానవన శాఖ వార్షిక ప్రణాళిక ఖరారు చేసిందని కలెక్టర్‌ భారతి

ఉద్యాన అభివృద్ధి పథకం ద్వారా రైతులకు రాయితీలు

కలెక్టర్‌  భారతి హొళికేరి 


మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 18 : సమీకృత ఉద్యానశాఖ అభివృద్ధి మిష న్‌ ద్వారా ప్రభుత్వం ఉద్యానవన శాఖ వార్షిక ప్రణాళిక ఖరారు చేసిందని కలెక్టర్‌ భారతి హొళికేరి అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో ఉద్యానవన శాఖ అను బంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ, జిల్లాలో రూ.6.27 లక్షలతో 34.60 హెక్టార్లలో పండ్ల తోటలను పెంచనున్న ట్లు తెలిపారు. గత ఏడాది తోటలు నాటిన రైతులకు రెండు, మూడవ సంవ త్సరానికి ఇవ్వాల్సిన రాయితీలు ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. జిల్లాలో మామిడి 25 హెక్టార్లు, జామ 4.80 హెక్టార్లు, బొప్పాయి 4.80 హెక్టార్లు పెంచాలని ప్రణా ళిక రూపొందించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 22.20 హెక్టార్లలో సాగు చేసిన పండ్ల తోటలకు 40 శాతం రాయితీ చెల్లించనున్నారు. మల్చింగ్‌ కింద రక్షి త సేద్యంలో భాగంగా మిరప, కూరగాయలు, పూలతోటలకు 50 శాతం రాయితీ తో 20 హెక్టార్లకు రూ.3.20 లక్షలు వెచ్చిస్తున్నారు. యాంత్రీకరణ కింద రూ.7.75 లక్షలతో చిన్న, సన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, ఇతరులకు 40 శాతం రాయితీపై 8 చిన్న ట్రాక్టర్లు, 10 బ్రష్‌ కట్టర్లు పంపిణీ చేయనున్నారు.   


మూడో సంవత్సరం రాయితీ కింద మామిడి 16.80 హెక్టార్లకు రూ.55 వేలు, జామ 3 హెక్టార్లకు రూ.18, రేగుపడు 2.40 హెక్టార్లకు రూ.7 వేలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల రైతులు ఆయా నియోజకవర్గ  ఉద్యానవన అధికారులను  సంప్రదించాలని తెలిపారు. రాయితీ కోసం జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీ పూర్‌, నస్పూర్‌ రైతులు కె. నహజ 7997725416, బెల్లంపల్లి, తాండూర్‌, కన్నెపల్లి, భీమిని, నెన్నెల, వేమనపల్లి, కాసిపేట రైతులు సి.హెచ్‌. సుప్రజ 7997725034, మందమర్రి, జైపూర్‌, భీమారం, చెన్నూర్‌, కోటపల్లి రైతులు ఆర్‌.తిరుపతి 79977 25029లలో సంప్రదించాలన్నారు. జిల్లా వ్యవసాయఅధికారి వీరయ్య, ముఖ్య ప్రణాళికఅధికారి నరేందర్‌, ఉద్యానవనశాఖ అధికారి యుగేందర్‌ పాల్గొన్నారు. 


షెడ్యూల్డ్‌ కులాల అభ్యున్నతికి కృషి చేయాలి

ఎస్సీ, ఎస్టీ షెడ్యూల్డ్‌ కులాల అభ్యున్నతికి అన్ని శాఖల అధికారులు బాధ్యత గా విధులు నిర్వహించాలని కలెక్టర్‌ భారతి హొళికేరి అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌, మానిటరీ కమిటీ సమావేశాన్ని నిర్వ హించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మూడు నెలలకు ఒకసారి సమావేశం జరగాల్సి ఉండగా కొవిడ్‌ నేపథ్యంలో ఆలస్యమైందన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పరిష్కారం రివ్యూ చేశారు. ప్రతీ నెలా 30న మండల స్థాయిలో నిర్వహించే పౌర హక్కుల దినోత్సవం నివేదికలను అందించాలని తెలిపారు. భూ సమస్యలపై రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. షెడ్యూల్డ్‌ కులాల అట్రాసిటీ కేసుల నమోదు, నష్టపరిహారం చెల్లింపులు బాధితులకు సక్రమంగా అందడంతో పాటు సమగ్ర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  బెల్లంపల్లి ఆర్డీఓ శ్యామలాదేవి, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల శాఖ అధికారి రవీందర్‌ రెడ్డి, జిల్లా ఖజానాశాఖ అధికారి సరోజ, బెల్లంపల్లి, జైపూర్‌, మంచిర్యాల ఏసీపీ లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ సభ్యులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-09-19T05:30:00+05:30 IST