ధనియాల సాగుకు రాయితీ

ABN , First Publish Date - 2021-12-09T06:33:15+05:30 IST

ధనియాలు సాగు చేసే రైతులకు రా యితీ చెల్లిస్తున్నట్లు ఉ ద్యాన శాఖ ఇనచార్జి డీడీ సతీష్‌ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు.

ధనియాల సాగుకు రాయితీ

అనంతపురం వ్యవసాయం, డిసెంబరు 8: ధనియాలు సాగు చేసే రైతులకు రా యితీ చెల్లిస్తున్నట్లు ఉ ద్యాన శాఖ ఇనచార్జి డీడీ సతీష్‌ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాల పరిధిలో ధనియాలు సాగు చేసుకున్న  ఒక్కో రైతుకు హెక్టారుకు గరిష్టంగా రూ.3 వేలు చెల్లిస్తామన్నారు. రైతులే ధనియాలు కొనుగోలు చేసుకుని, విత్తుకోవాలన్నారు. స్థానిక రైతు భరోసా కేంద్రంలో రాయితీ కోసం దరఖాస్తు చేసుకుంటే, సిబ్బంది క్షేత్రస్థాయిలో పంట వేసిన తర్వాత ఫొటో తీసుకుంటారన్నారు. అర్హులైన రైతులకు ఉద్యాన శాఖ తరపున రాయితీ డబ్బు చెల్లిస్తామన్నారు. వివరాలకు 79950 86998, 7995086991 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2021-12-09T06:33:15+05:30 IST