Abn logo
Sep 27 2021 @ 00:35AM

స్టీల్‌ప్లాంట్‌లో గణనీయ ఉత్పత్తి

‘50 మిలియన్‌ టన్నుల’ పార్కును ప్రారంభిస్తున్న స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ అతుల్‌భట్‌

సీఎండీ అతుల్‌భట్‌ 

ఉక్కుటౌన్‌షిప్‌, సెప్టెంబరు 26: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అన్ని రంగాలలో అభివృద్ధి చెంది, గణనీయ ఉత్పత్తి సాధిస్తున్నదని సంస్థ సీఎండీ అతుల్‌భట్‌ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ బ్లాస్ట్‌ ఫర్నేస్‌(బీఎఫ్‌)-1 విభాగం ఆవరణలో ‘50 మిలియన్‌ టన్నుల’ పార్కును ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ 1990లో విభాగం ప్రారంభమైందని, నాటి నుంచి కొద్దిరోజుల క్రితం వరకు 50 మిలియన్‌ టన్నుల హాట్‌ మెటల్‌ ఉత్పత్తి చేసిందన్నారు. ఇందుకు గుర్తుగా ఈ పార్కును ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) ఏకే సక్సేనా, ఉన్నతాధికారులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.