పెయిడ్‌కు ప్రత్యామ్నాయం!

ABN , First Publish Date - 2020-11-14T05:30:00+05:30 IST

ఫొటోలను స్టోర్‌ చేయడానికి అవకాశం కల్పించే గూగుల్‌ ఫొటోస్‌ వచ్చే ఏడాది జూన్‌ 1 నుంచి పెయిడ్‌ సైట్‌ కాబోతోంది. ఫ్రీడేటాను 15

పెయిడ్‌కు ప్రత్యామ్నాయం!

ఫొటోలను స్టోర్‌ చేయడానికి అవకాశం కల్పించే గూగుల్‌ ఫొటోస్‌ వచ్చే ఏడాది జూన్‌ 1 నుంచి పెయిడ్‌ సైట్‌ కాబోతోంది. ఫ్రీడేటాను 15 జిబికి పరిమితం చేస్తోంది. అయితే ముందు వరకు అప్‌లోడ్‌ చేసుకున్న ఫొటోలకు మాత్రం అన్‌లిమిటెడ్‌ స్టోరేజ్‌కు అవకాశం ఉంటుంది. మరి గూగుల్‌ ఫొటోస్‌ వినియోగదారులకు ఉండే ఆప్షన్‌ ఏమిటి? ఏయే సైట్లు ఎంత చార్జ్‌ చేస్తున్నాయో ఒక లుక్‌ వేయండి. 


గూగుల్‌ వద్ద నాలుగు ట్రిలియన్ల మేర ఫొటోలు, వీడియోల స్టోర్‌ ఉండగా ప్రతివారం 28 బిలియన్ల ఫొటోలు కొత్తగా అప్‌లోడ్‌ అవుతున్నాయి. సర్వర్‌పై లోడ్‌ తగ్గించుకోవడంలో భాగంగా పెయిడ్‌ విధానాన్ని ప్రారంభించారు. ఈ లోపు కొత్త స్టోరేజ్‌ మేనేజ్‌మెంట్‌ టూల్‌ని పరిచయం చేయబోతోంది. ఇప్పటికే గూగుల్‌ ఫొటోస్‌ యూజర్లు ఈ టూల్‌ సహాయంతో అనవసర, బ్లర్డ్‌, రిపీటెడ్‌ ఇమేజ్‌లను క్లియర్‌ చేసుకోవచ్చు. అప్పటికీ స్పేస్‌ అవసరం అనుకుంటే కొనుగోలు చేయాల్సి వస్తుంది. 

గూగుల్‌ ఒన్‌ సబ్‌స్ర్కిప్షన్‌ కింద స్పేస్‌ కొనుగోలు సదుపాయం ఉంటుంది. నెలకు దాదాపుగా రెండు డాలర్లతో 100 జిబి స్టోరేజ్‌ని పొందవచ్చు. వివిధ దేశాలను బట్టి రేటులో తేడా ఉంటుంది.

గూగుల్‌ ఫొటోస్‌తోపాటు ఇతర సైట్లు కూడా స్పేస్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఏ సైట్లు ఎంత రేటు ఆఫర్‌ చేస్తున్నాయి, ఎంత స్పేస్‌ ఇస్తున్నాయి అనే దానిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. 

ఒక్క ఫొటోలే స్టోర్‌ చేయాలి అనుకుంటే ‘ఫ్లికర్‌’ బాగుంటుంది. వెయ్యివరకు మీడియా ఐటెమ్‌లను,  200 ఎంబి ఫైల్‌ లిమిట్‌ను ఫొటోలకు, ఒక జిబి పరిమితిని వీడియోలకు ఇస్తుంది. కేవలం ఫోన్‌ కెమరాతోనే స్టోర్‌ను వాడుకోవాలని అనుకునే వారిక ఇది సరిపోతుంది. వార్షిక ప్లాన్‌ కేటగిరీని ఎంపిక చేసుకుని నెలకు సుమారుగా ఆరు డాలర్ల ఫీజు చెల్లిస్తే ‘ప్రొ’కు వెళ్ళవచ్చు. అదే తీసుకుంటే స్టోరేజ్‌ అపరిమితం. 

‘డ్రాప్‌బాక్స్‌’ మరో ఆప్షన్‌. ఇక్కడ కూడా వార్షిక ప్లాన్‌ కేటగిరీని ఎంపిక చేసుకుని నెలకు సుమారుగా పది డాలర్ల రుసుము చెల్లిస్తే రెండు ట్రిలియన్‌ బైట్ల మేర స్పేస్‌ వస్తుంది. 

వీటితోపాటు మరికొన్ని సైట్లు కూడా ఉన్నాయి. ఆపిల్‌కి అలావాటు పడిన యూజర్లు అయితే 5జిబి ఐక్లౌడ్‌ స్టోరేజ్‌ సదుపాయం దానంతట అదే లభిస్తుంది కూడా. ఒకవేళ అంతకంటే ఎక్కువ స్టోరేజ్‌ కావాల్సి వస్తే ఒక డాలరు కంటే తక్కువ మొత్తానికే నెలకు 50 జిబి మేర సదుపాయాన్ని ఆపిల్‌ ఆఫర్‌ చేస్తోంది.


Updated Date - 2020-11-14T05:30:00+05:30 IST