కరోనా అవగాహనను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2020-05-28T11:33:33+05:30 IST

కరోనా నివారణపై శుక్రవారం జరిగే అవగాహనా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ వీరపాండియన్‌

కరోనా అవగాహనను విజయవంతం చేయండి

  •  టెలీ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ వీరపాండియన్‌

కర్నూలు, మే 27(ఆంధ్రజ్యోతి): కరోనా నివారణపై శుక్రవారం జరిగే అవగాహనా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ అన్నారు. బుధవారం  టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన జిల్లా, మున్సి పల్‌, మండల అధికారులతో మాట్లాడుతూ కరోనా లక్షణాలు, పరీక్షలు, చికిత్స విఽధానాలపై ఈనెల 29న ఉదయం 7 గంటల నుంచి గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, హెల్త్‌ ఎడ్యుకేటర్లు, డీఆర్డీఏ, మెప్మా సిబ్బంది, ఎస్‌హెచ్‌జీ సంఘాల మహిళలతో ప్రతి ఇంటా అవగాహనా కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. దగ్గు, జ్వరం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది ఉంటే స్వచ్ఛందంగా  కరోనా పరీక్షలు చేయించుకుని, చికిత్స పొందడంపై కూడా అవగాహన పెంచాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను గురువా రం  తనకు వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీలు రవిపట్టన్‌ శెట్టి, రామసుందర్‌రెడ్డి, సయ్యద్‌ ఖాజామోహీద్దీన్‌, నగర కమిషనర్‌ డీకే బాలాజీ, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ నిధి మీనా, డీఆర్డీవో పీడీ శ్రీనివాసులు, జడ్పీ సీఈవో వెంకట సుబ్బయ్య, మెప్మా పీడీ తిరుమలేశ్వరరెడ్డి, ఐసీడీఎస్‌ పీడీ భాగ్యరేఖ, డీఎంహెచ్‌వో, డీపీవో ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-28T11:33:33+05:30 IST