ఓటీఎస్‌ను వివరించడంలో సఫలం: నవాజ్‌బాషా

ABN , First Publish Date - 2021-12-08T06:14:52+05:30 IST

ఓటీఎస్‌ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మదనపల్లె ప్రజాప్రతినిధులు, అధికారులు సఫలమయ్యారని ఎమ్మెల్యే నవాజ్‌బాషా పేర్కొన్నారు. నిర్దేశిత రూ.2కోట్లలో రూ.1.20కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు.

ఓటీఎస్‌ను వివరించడంలో సఫలం: నవాజ్‌బాషా
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నవాజ్‌బాషా

మదనపల్లె, డిసెంబరు 7: ఓటీఎస్‌ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మదనపల్లె ప్రజాప్రతినిధులు, అధికారులు సఫలమయ్యారని ఎమ్మెల్యే నవాజ్‌బాషా పేర్కొన్నారు. నిర్దేశిత రూ.2కోట్లలో రూ.1.20కోట్లు  వసూలు చేసినట్లు చెప్పారు. టౌన్‌హాలులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటీఎస్‌ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఎవరినీ ఒత్తిడి చేయొద్దన్నారు. పథక ఉద్దేశం, ప్రయోజనాలను వివరించాలని కోరారు. తాను  అవినీతికి పాల్పడినట్లుగానీ, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే  రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనకు చిన్ననాటి మిత్రుల కంటే కూడా ప్రజా సంక్షేమమే ముఖ్యమన్నారు.  మున్సిపాలిటీ, మండల పరిధిలో వేసిన లేఅవుట్లపై కౌన్సిలర్లు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఎంపీడీవో లీలామాధవిని కోరారు. మున్సిపాలిటీలో గృహనిర్మాణాల్లో ఎక్కువగా ఫేక్‌ పట్టాలున్నాయని, వీటిపై మున్సిపల్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ అధికారులు విచారణ చేపట్టి పదిరోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ ఎమ్మెల్యే కోరారు. ఫేక్‌ పట్టాలు ఆధారంగా నిర్మించిన ఇళ్లను ఓటీఎస్‌లో  లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.మున్సిపల్‌ వైస్‌చైర్మన్లు జింకా వెంకటాచలపతి,  నూర్‌ఆజాం, జడ్పీటీసీ సభ్యుడు డి.ఉదయ్‌కుమార్‌,  ఎంపీపీ రెడ్డెమ్మ, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీసభ్యులు, మున్సిపల్‌ కమిషనర్‌ జి.రఘునాథరెడ్డి, తహసీల్దార్‌ సి.కె.శ్రీనివాసులు, ఎంపీడీవో లీలామాధవి, హౌసింగ్‌ ఈఈ నాగరాజ, డీఈ పూల చంద్రశేఖర్‌, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T06:14:52+05:30 IST