సక్సెస్‌

ABN , First Publish Date - 2021-01-17T05:28:39+05:30 IST

ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతమైంది.

సక్సెస్‌
మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పీచ్‌ వింటున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- కొవిడ్‌-19 టీకీకరణ విజయవంతం

- ప్రధాని మోదీ సందేశం అనంతరం వ్యాక్సినేషన్‌కు శ్రీకారం

- ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 17 కేంద్రాల్లో సాగిన కార్యక్రమం

- 510 మంది వారియర్స్‌కు టీకా ఇచ్చిన యంత్రాంగం

- రేవల్లి కేంద్రంలో ఒకరు గైర్హాజరు

- ఉమ్మడి జిల్లాలో ఒకరికి కళ్లు తిరగడం మినహా అంతా సవ్యం

- కార్యక్రమాలను పర్యవేక్షించిన మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, ఎంపీ రాములు, కలెక్టర్లు


(వనపర్తి/గద్వాల-ఆంధ్రజ్యోతి)/మహబూబ్‌నగర్‌/తిమ్మాజి పేట/కల్వకుర్తి అర్బన్‌/కల్వకుర్తిటౌన్‌/మరికల్‌/మక్తల్‌/నారా యణపేట టౌన్‌, జనవరి 16 : ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతమైంది. కేంద్ర ప్ర భుత్వం, వైద్య, ఆరోగ్య శాఖ నిబంధనల మేరకు మొదటి విడ తలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వేసిన టీకా సక్సెస్‌ అయ్యింది.

- కరోనా టీకాకరణ కార్యక్రమం శనివారం మహబూబ్‌నగ ర్‌తో పాటు జడ్చర్ల, భూత్పూర్‌, జానంపేట కేంద్రాల్లో నిర్వ హించారు. మొత్తం 120 మందికి టీకా వేయాల్సి ఉండగా, 119 మందికి టీకాలు వేశారు. ముందుగా పాలమూరులోని జనరల్‌ ఆసుపత్రిలో ప్రధాని మోదీ సందేశాన్ని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వీక్షించారు. అనంతరం టీకా ప్రక్రియను ప్రారం భించారు. ఆసుపత్రి శానిటేషన్‌ విభాగంలో పని చేస్తున్న కృ ష్ణకు తొలి టీకా వేశారు. అనంతరం వారిని అరగంట పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఈ ఆసుపత్రిలో మొత్తం 30 మందికి గాను 28 మంది హాజరయ్యారు. ఒకరు గర్భిణి, మరొకరు కు టుంబ సభ్యుల అనారోగ్యం దృష్ట్యా హాజరు కాలేదు. దీంతో క లెక్టర్‌ వెంకట్రావు అనుమతితో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల డై రెక్టర్‌ పుట్ట శ్రీనివాస్‌, ఆర్థోపెడిక్‌ విభాగం వైద్యుడు నర్సింహ కుమార్‌కు టీకా వేశారు. జడ్చర్ల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించగా, ఒకరు బా లింత కావడంతో 29 మందికి టీకా వేశారు. భూత్పూర్‌లో ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించగా, ముగ్గురు గైర్హాజ రు కాగా వారి స్థానంలో ఆశలకు టీకా ఇచ్చారు. జానంపేట పీహెచ్‌సీలో 30 మందికి టీకా వేశారు.


- వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా వనపర్తి జిల్లాలోని డిస్ర్టిక్ట్‌ హాస్పిటల్‌, ఆత్మకూరు, రేవల్లి కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు, ఖిల్లా ఘణపుం ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రధాన మంత్రి ప్రారంభించారు. జిల్లా ఆస్పత్రిలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఆత్మకూరులో ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. జిల్లా ఆస్ప త్రిలో మానసిక వైద్య నిపుణులు సురేష్‌కుమార్‌, రేవల్లిలో మ త్తు వైద్య నిపుణులు రాజ్‌కుమార్‌, ఆత్మకూరులో డాక్టర్‌ లక్ష్మణ్‌ పటేల్‌, ఖిల్లాఘణపురంలో ఆశ వర్కర్‌ అనిత మొదటి వ్యాక్సిన్‌ తీసుకున్నారు. జిల్లాలో 120 మందిని ఎంపిక చేయగా, రేవల్లి లో బాలమ్మ, లక్ష్మి ఇద్దరు గైర్హాజరు కావడంతో వారి స్థానంలో మరో ఇద్దరిని ఎంపిక చేసి, వ్యాక్సిన్‌ ఇచ్చారు. ఈ కేంద్రంలో ఇ ద్దరి పేర్లు డబుల్‌ రావడంతో వారి స్థానంలో మరో ఇద్దరికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. రేవల్లిలో పారిశుధ్య కార్మికురాలు జహీరకు వ్యాక్సినేషన్‌ తర్వాత కొద్దిగా తల తిరిగినట్లు అనిపించడంతో ప్లూయిడ్స్‌ పెట్టారు. తర్వాత మామూలు స్థితికి రావడంతో పం పించారు. కాగా, ఉదయం పీఎం వర్చువల్‌ ప్రారంభం సంద ర్భంగా జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన టీవీ పని చేయకపో వడం కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాష ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. 


- కొవిడ్‌-19 టీకా కార్యక్రమాన్ని శనివారం జోగుళాంబ గ ద్వాల జిల్లా ఆసుపత్రిలో నాగర్‌కర్నూల్‌ ఎంపీ పి.రాములు ప్రారంభించారు. తొలి టీకాను జిల్లా వైద్యాధికారి చందునాయ క్‌కు, రెండో టీకాను ఏఎన్‌ఎం లక్ష్మికి వేశారు. ధరూరులో డి ప్యూటీ పారా మెడికల్‌ అధికారి ప్రవీణ్‌సాగర్‌, అలంపూర్‌లో ఆ సుపత్రి సిబ్బంది నాగచంద్ర, ఇటిక్యాలలో ఏఎన్‌ఎం పుష్పలత ఆయా కేంద్రాల్లో మొదటి టీకాను వేసుకున్నారు. జిల్లా వ్యాప్తం గా నాలుగు కేంద్రాల్లో మొత్తంగా 121 మందికి అధికారులు టీ కా వేశారు. అంతకు ముందు ఎంపీతో పాటు స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, కలెక్టర్‌ శ్రుతి ఓఝా ప్రధాన మంత్రి పర్చువల్‌ స్పీచ్‌ను వీక్షించారు. కార్యక్ర మంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శోభారాణి, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మ, ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ పాల్గొన్నారు.


- నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని తిమ్మాజిపేట ప్రాథమిక ఆరో గ్య కేంద్రం, కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టీకా కార్య క్రమాన్ని నిర్వహించారు. తిమ్మాజిపేటలో మొత్తం 156 మం దికి టీకా వేయాలని నిర్ణయించగా, మొదటి రోజు 30 మందికి వేశారు. అదనపు జిల్లా కలెక్టర్‌ మనుచౌదరి, జడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ప్రధాన మంత్రి ప్రసం గం అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్‌ ఎల్‌పీ శర్మన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. కల్వకుర్తిలో కలెక్టర్‌, ఎమ్మె ల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలాజీసింగ్‌ స మక్షంలో ల్యాబ్‌ అసిస్టెంట్‌ సత్తయ్యకు, ఏఎన్‌ఎం నాగమణిల కు టీకా ఇచ్చారు. కార్యక్రమాల్లో జిల్లా వైద్యాధికారి సుధాకర్‌లాల్‌, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌, డీసీసీబీ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌రెడ్డి, ఆ ర్డీవో నాగమణి తదితరులు పాల్గొన్నారు.


- నారాయణపేట జిల్లా ఆసుపత్రితో పాటు మక్తల్‌ ప్రభు త్వ ఆసుపత్రి, మరికల్‌ పీహెచ్‌సీలలో శనివారం కరోనా టీకా కార్యక్రమాన్ని నిర్వహించారు. 

నారాయణపేటలో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్‌ హరిచందనతో పాటు ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్ర మాల్లో జడ్పీ చైర్మన్‌ వనజమ్మ, ఆర్డీవో శ్రీనివాసులు, డీఎంహె చ్‌ఓ జయచంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T05:28:39+05:30 IST