ఏఐటీయూసీ రాష్ట్రసభలను జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2022-01-19T06:15:50+05:30 IST

గుంటూరులో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని యూనియన్‌ జిల్లాఅధ్యక్షుడు సాంబశివ పిలుపునిచ్చారు. ఈనెల 29నుంచి 31 వరకు జరగనున్న రాష్ట్ర 17వ సభల పోస్టర్‌ను మంగళవారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆయన ఆవిష్కరించారు.

ఏఐటీయూసీ రాష్ట్రసభలను జయప్రదం చేయండి
రాష్ట్రమహాసభల గోడపత్రికను విడుదల చేస్తున్న ఏఐటీయూసీ జిల్లాఅధ్యక్షు డు సాంబశివ తదితరులు

మదనపల్లె అర్బన్‌, జనవరి 18: గుంటూరులో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని యూనియన్‌ జిల్లాఅధ్యక్షుడు సాంబశివ పిలుపునిచ్చారు. ఈనెల 29నుంచి 31 వరకు జరగనున్న  రాష్ట్ర 17వ సభల పోస్టర్‌ను మంగళవారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా సాంబశివ మాటాడుతూ... కేంద్రప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందన్నారు.  జీవిత బీమా సంస్థ, రైల్వే, బ్యాంకులు, ఓడరేవులు, విమానాశ్రయాలు, రక్షణ రంగం వంటి కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించిందన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కార్మిక కోడ్లను తెచ్చిందన్నారు. నిత్యావసరాలు ధరలు అధికంగా పెరిగాయని, దీనికి అనుగుణంగా వేతనాలను పెంచాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికలును పర్మనెంట్‌ చేస్తామని చెప్పిన సీఎం జగన్‌ ఇంతవరకు పట్టించుకోలేదన్నారు.   దేవ, రెడ్డెప్ప సురేష్‌కుమార్‌, నాగరాజు, పోతులప్ప, సంజీవ తదితరలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T06:15:50+05:30 IST