గతంలో వచ్చిన బాలీవుడ్ పాత చిత్రాల రీమేక్‌లు
అమితాబ్ బచ్చన్ - డాన్ 1978 షారూఖ్‌ఖాన్ - డాన్ - 2006
రేఖ - ఉమ్రావ్ జాన్- 1981 ఐశ్వర్యారాయ్ - ఉమ్రావ్ జాన్ - 2006
అమితాబ్ బచ్చన్ - షోలే - 1975 అమితాబ్ బచ్చన్ - ఆగ్ - 2007
రిషికపూర్ కర్జ్ - 1980
హిమేష్ రేషమ్మియా - కర్జ్ - 2008
అమితాబ్ బచ్చన్ - అగ్నిపథ్ - 1990 హృతిక్ రోషన్ - అగ్నిపథ్ - 2012
అమోల్ పాలేకర్- గోల్ మాల్ - 1979 అజయ్ దేవ్‌గణ్ - బోల్ బచ్చన్ -2012
జితేంద్ర - హిమ్మత్వాలా - 1983 అజయ్‌దేవ్‌గణ్ -హిమ్మత్వాలా - 2013
ఫరూఖ్ షేక్ -చష్మే బద్దూర్ - 1981 సిద్ధార్థ్ - చష్మేబద్దూర్- 2013
అమితాబ్ బచ్చన్ - జంజీర్ -1973
రామ్‌చరణ్ - జంజీర్ - 2013
హిట్ ఫార్ములా ఎక్కడ ఉంటే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అక్కడ వాలిపోతుంది.
ఓ వైపు హాలీవుడ్ చిత్రాలను రీమేక్ చే యడంతో పాటు మరోవైపు ప్రాంతీయ భాషా చిత్రాలను హిందీలో రీమేక్ చేయడం సాధారణమే. వీటితో పాటు బాలీవుడ్ ఇప్పుడు తన పాత చిత్రాలపైనే కన్నేసింది. వెండితెరపై కాసుల వర్షం కురిపించె సక్సెస్ ఫార్ములాగా మార్చుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్లో రీమేక్‌కు సిద్ధం అవుతోన్న పాత హిందీ చిత్రాల విశేషాలు...
నమక్ హలాల్
దాదాపు 40 ఏళ్ల తరువాత అమితాబ్ బచ్చన్ ‘నమక్ హలాల్’ చిత్రం రీమేకు అవుతోంది. అమితాబ్, పర్వీన్ బాబీ, స్మితాపాటిల్, శశికపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం 1982లో విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం రీమేక్ హక్కులను ‘కబీర్ సింగ్’ నిర్మాత మురాద్ ఖేతని దక్కించుకున్నారు. ‘‘ఈ సినిమా స్ర్కిప్ట్ వర్క్ పూర్తయ్యాక దర్శకుడు, నటీనటుల ఎంపిక ప్రారంభిస్తాం’’ అని మురాద్ చెప్పారు.
బడేమియా ఛోటేమియా
గోవిందా ‘కూలీ నంబర్ వన్’ చిత్రంతో వరుణ్‌ధావన్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన గోవిందా నటించిన మరో చిత్రంపై కన్నేశారు. అమితాబ్ బచ్చన్, గోవిందా ప్రధాన పాత్రలు పోషించిన ‘బడేమియా ఛోటేమియా’ చిత్రం రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నిర్మాత జాకీ భగ్నానీ చాలా కాలంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని భావిస్తున్నారు. గోవిందా పాత్రను వరుణ్‌తో చేయించాలనేది ఆయన ఆలోచనట. అంతేకాదు ఈ రీమేక్‌కు వరుణ్ తండ్రి డేవిడ్ ధావ న్ దర్శకత్వం వహిస్తారట. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.
సత్తే పే సత్తా
అమితాబ్ బచ్చన్, హేమామాలిని జంటగా నటించిన ‘సత్తే పే సతా’్త చిత్రాన్ని రీమేక్ చేయాలని బాలీవుడ్లో చాన్నాళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. గతంలో రోహిత్ శెట్టి నిర్మాతగా ఫరాఖాన్ దర్శకత్వంలో ఈ చిత్రం రీమేక్‌ను ప్రకటించారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే హృతిక్ రోషన్, అనుష్క శర్మ జంటగా నటించాల్సింది. కానీ రీమేక్ రైట్స్‌కు భారీమొత్తం అడగటం ఒక కారణం. తర్వాత హృతిక్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దాంతో అటకెక్కిందనుకున్న ఈ రీమేక్‌ను లాక్డౌన్ కాలంలో మళ్లీ బయటకు తీశారు. స్కిప్ట్‌లో మార్పులు చేసి కొత్త నటులతో సత్తే పే సత్తా చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు.
కొంత నిరాశ
అయితే పాత చిత్రాలను రీమేక్ చేయడం ద్వారా హిట్ కొట్టాలనే లక్ష్యం అన్నిసార్లు నెరవేరడం లేదు. సంజయ్ దత్, పూజాభట్ జంటగా 1991లో వచ్చిన ‘సడక్’ చిత్రం పెద్ద హిట్. కానీ గతేడాది వచ్చిన ‘సడక్’ రీమేక్ మాత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.