ప్రయత్నంతోనే సఫలం!

ABN , First Publish Date - 2021-03-21T05:21:43+05:30 IST

అనగనగా ఒక ఊరిలో రాజు అని ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి రకరకాల వస్తువులు సేకరించడం హాబీ. పుస్తకాలు, నాణేలు సేకరించే వాడు

ప్రయత్నంతోనే సఫలం!

అనగనగా ఒక ఊరిలో రాజు అని ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి రకరకాల వస్తువులు సేకరించడం హాబీ. పుస్తకాలు, నాణేలు సేకరించే వాడు. అలా సేకరించిన వస్తువులను ఒక పెట్టెలో దాచుకునేవాడు. ఒకరోజు అతడి ఇంట్లోకి ఒక ఎలుక ప్రవేశించింది. ఆ ఎలుక పెట్టెలో దాచుకున్న రాజు పుస్తకాన్ని కొరికేసింది. దాంతో రాజుకు చాలా కోపం వచ్చింది. ఎలాగైనా ఎలుకను పట్టుకోవాలని, ఒక బోను తీసుకొచ్చాడు. అందులో ఒక పండును పెట్టి ఎలుక ఎక్కువగా తిరిగే చోట పెట్టాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి చూస్తే బోనులో ఎలుక ఉంది. ఆ ఎలుకను బోనులో నుంచి ఒక పాలిథీన్‌ కవర్‌లోకి మార్చాడు.


ఆక్సిజన్‌ అందడం కోసం చిన్న రంధ్రం చేసి పెట్టాడు. అయితే ఎలుక కవర్‌లో నుంచి తప్పించుకోవడానికి ఎగరసాగింది. చిన్నరంధ్రంలో నుంచి బయటపడటం కోసం అనేక ప్రయత్నాలు చేసింది. అదంతా రాజు గమనిస్తూనే ఉన్నాడు. ఎలుక ఎగిరి ఎగిరి ఆ రంధ్రాన్ని తన మూతితో కాస్త పెద్దది చేసింది. తరువాత అందులో నుంచి బయటపడే ప్రయత్నంలో తల రంధ్రంలో ఇరుక్కుపోయింది. అయినా పట్టు వదలకుండా ప్రయత్నించి రంధ్రాన్ని పెద్దది చేసి బయటపడింది. ఎలుక తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎంత కష్టపడిందో రాజు చూశాడు. కష్టపడితే ఫలితం ఉంటుందని, ప్రయత్నిస్తే విజయం లభిస్తుందని మనసులో అనుకున్నాడు.

Updated Date - 2021-03-21T05:21:43+05:30 IST