విజయవంతంగా లేజర్‌ గైడెడ్‌ ఏటీజీఎం పరీక్ష

ABN , First Publish Date - 2020-10-21T09:22:46+05:30 IST

పూర్తిస్థాయిలో దేశీయంగా అభివృద్ధి చేసిన లేజర్‌ గైడెడ్‌ యాంటీ-ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్‌(ఏటీజీఎం)ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది.

విజయవంతంగా లేజర్‌ గైడెడ్‌  ఏటీజీఎం పరీక్ష

 న్యూఢిల్లీ, అక్టోబరు 20: పూర్తిస్థాయిలో దేశీయంగా అభివృద్ధి చేసిన లేజర్‌ గైడెడ్‌ యాంటీ-ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్‌(ఏటీజీఎం)ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని ఈ నెల 1న మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో ఉన్న కేకే రేంజర్స్‌ ఇన్‌ ఆర్మ్‌డ్‌ కార్ప్స్‌ సెంటర్‌ అండ్‌ స్కూల్‌(ఏసీసీఎ్‌స)లో.. ఎంబీటీ అర్జున్‌ ట్యాంక్‌ ద్వారా పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్షిపణి 1.5 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. ఇంతకు ముందు సెప్టెంబరు 23న కూడా ఈ క్షిపణిని పరీక్షించారు. వేర్వేరు యుద్ధ ట్యాంకుల నుంచి ప్రయోగించేందుకు వీలుగా ఈ క్షిపణిని తయారుచేస్తున్నారు. ప్రస్తుతం ఎంబీటీ అర్జున్‌ ట్యాంకుల ద్వారా పరీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-10-21T09:22:46+05:30 IST