Advertisement
Advertisement
Abn logo
Advertisement

సక్సెస్ సాధించినవారు తమకు నచ్చని పనులను ఎలా చేస్తారు?.. ఇదొక్కటీ తెలుసుకుంటే మీ జీవితమే మారిపోతుంది!

మనకు ఏ మాత్రం ఇష్టంలేని పని చేయాల్సివచ్చినప్పుడు చేస్తాను అని చెప్పడం ముఖ్యమో? లేదా మరేదైనా సమాధానం చెప్పి తప్పించుకోవాలా? సక్సెస్ సాధించిన వ్యక్తులు ఇటువంటి సందర్భాల్లో ఎలా వ్యవహరిస్తారు? ఏం చేస్తారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

నచ్చని పనిని సంతోషంగా, హృదయ పూర్వకంగా చేయండి

మనలో చాలా మంది తమకు నచ్చని పనిని చేయవలసి వచ్చినప్పుడు వెనకడుగు వేస్తారు. తమ మార్గాన్ని మార్చుకుంటారు. అది అపజయానికి దారి తీస్తుంది. అయితే విజయం సాధించిన వ్యక్తులు తమకు నచ్చని పనులు చేయాల్సివచ్చినప్పుడే ఏమాత్రం సంకోచం లేకుండా, సంతోషంతో, హృదయపూర్వకంగా ఆ పనిని చేస్తారు. కఠినమైన పరిస్థితులలోనూ అలానే వ్యవహరిస్తారు. ఎందుకంటే వారి ఎదుట ఏకైక లక్ష్యం ఉంది.. అదే విజయం సాధించడం. (’జీత్నా హై తో జిద్ కరో‘ నుంచి)

ఏది తప్పు? ఏది తప్పు?

ఏది తప్పు? ఏది ఒప్పు? అనే అంశాల మధ్య వ్యత్యాసాన్ని గ్రహించడం సానుకూల ఆలోచనలకు దారితీస్తుంది. ఎవరిది తప్పు అనేది తెలుసుకోవడంలో మీరు నిరంతరం నిమగ్నమై ఉంటే మీ లక్ష్యానికి దూరమవుతారు. ఇంకొకరిని నిందించడానికి ప్రయత్నించినపుడు మీలో నెగిటివ్ ఆలోచనలు రేకెత్తుతాయి. అవి మిమ్మల్ని మరింత దిగజారుస్తాయి (‘పవర్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్’ నుంచి)

వేచి ఉండకండి, సమయం ఎప్పటికీ ఒకేలా ఉండదు

చాలా మంది వ్యక్తులు విఫలమవడానికి కారణం వేచి చూసే ధోరణి. ఇలాంటివారు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తుంటారు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు కనుక వేచి ఉండే ధోరణని విడిచిపెట్టాలి. మీరు నిలబడి ఉన్న చోటే అనుకున్న పనిని ప్రారంభించాలి. మీ వద్ద ఉన్న సమాచార సాధనాలతో పని ప్రారంభించండి. పనిలో ముందుకు వెళుతున్న కొద్దీ మెరుగైన పరికరాలు మీకు అందుబాటులోకి వస్తాయి. (‘థింక్ అండ్ గ్రో రిచ్’ నుంచి)

కళ్లతో మాట్లాడితే నమ్మకం పెరుగుతుంది

మీరు మీ కళ్లతో మాట్లాడటం వలన ఎదుటి వ్యక్తికి మీరెంతో నిజాయితీగా ఉన్నారనే సందేశాన్ని అందిస్తుంది. అప్పుడే వారు మీరు చెప్పేది పూర్తిగా నమ్ముతారు. మీరు ఎప్పుడూ ఇతరుల కళ్లలోకి చూస్తూ మాట్లాడండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్నిమరింతగా పెంపొందిస్తుంది. (‘లౌడర్ థెన్ వర్డ్స్’ నుంచి)


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement