కుమార్తెతో తండ్రి ఆత్మహత్య... కన్నీరు పెట్టించిన సూసైడ్‌ నోట్‌

ABN , First Publish Date - 2021-04-10T21:18:14+05:30 IST

కుమార్తెతో తండ్రి ఆత్మహత్య... కన్నీరు పెట్టించిన సూసైడ్‌ నోట్‌

కుమార్తెతో తండ్రి ఆత్మహత్య... కన్నీరు పెట్టించిన సూసైడ్‌ నోట్‌

విజయవాడ: నగరంలోని రామకృష్ణాపురంలో విషాదఘటన చోటుచేసుకుంది. పదేళ్ల కుమార్తెతో కలిసి తండ్రి రవి(40) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య అనారోగ్యానికి గురైందనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు, తన అవయవాలను భార్యకు ఇవ్వాలని భర్త సూసైడ్‌ నోట్‌లో రాశాడు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో భార్య బాధపడుతుంది. ఈ ఘటనతో రామకృష్ణాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-04-10T21:18:14+05:30 IST