Abn logo
Sep 23 2021 @ 00:39AM

జీవితంపై విరక్తి చెంది బేల్దారి ఆత్మహత్య

అనంతపురం క్రైం, సెప్టెంబరు 22: జీ వితంపై విరక్తి చెంది నగర శివారులోని సుందరయ్యకాలనీకి చెందిన బేల్దారి గ ణేష్‌(30) హెచ్చెల్సీలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నాల్గవ పట్టణ పోలీసు లు తెలిపిన మేరకు గణే్‌షకు ఆరేళ్ల కిందట కదిరికి చెందిన యువతితో వి వాహం జరిగింది. వీరికి ఐదేళ్ల బాలు డు ఉన్నాడు. నాలుగేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో అతడి భార్య చనిపోవడంతో బాలుడిని ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఒంటరి జీవితం భరించలేక గణేష్‌ తాగుడుకు బానిసయ్యాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెంది, బుధవారం నగర శివారులోని రాయల్‌నగర్‌ సమీపంలోని హెచ్చెల్సీలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తర్వాత గమనించిన స్థాని కులు పోలీసులకు సమాచారం అందించారు. నాల్గవ పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.


కాలువలో పడి బాలుడి మృతి

నగర శివారులోని తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)లో పడి ఓ బాలుడు మృతి చెందాడు. త్రీటౌన పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. నగరంలోని ఇందిరానగర్‌కు చెందిన నందకిషోర్‌(14) రోజువారిగానే బుధవారం ఉదయాన్నే వాకింగ్‌కు బయటకు వ చ్చాడు. ఇతడికి మానసిక స్థితి సరిగా లేదని సమాచారం. ఏం జరిగిందో ఏమో కానీ ఇందిరానగర్‌ శివారులోని హెచ్చెల్సీలో పడ్డాడు. కొంతసేపటికి శవమై తేలాడు. స్తానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో త్రీటౌన పోలీసులు అక్కడికి చేరుకుని మృత దేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. బాలుడి మృతిపై త్రీటౌన పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో బాలుడు పడిపోయాడా..? ప్రమాదవశాత్తు పడ్డాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.