Jun 23 2021 @ 12:34PM

నయనతారకి విలన్‌గా కన్నడ హీరో ..?

నయనతారకి విలన్‌గా కన్నడ హీరో నటించనున్నాడని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ ఉన్న నయనతార ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరొకవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలను వరుసగా చేస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఆమె పేషన్ స్టూడియోస్‌తో రెండు సినిమాలు చేసేందుకు సైన్ చేసిందట. అభిషేక్ పిక్చర్స్ - పేషన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. వీటిలో ఒక సినిమాను డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించబోతున్నాడట. ఇందులో ఓ కీలక పాత్రకు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈయన కన్నడలో హీరోగా నటిస్తూనే, ఇతర భాషల్లోనూ విలన్ పాత్రలు చేస్తూ బాగా క్రేజ్ సంపాదించుకున్నాడు. కథలో తన పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటే ఏమాత్రం ఆలోచించకుండా ఒకే చెప్పేస్తున్నాడు. అలాగే ఇప్పుడు నయన్ సినిమాకి ఒకే చెప్పినట్టు సమాచారం. కాగా ఇది విలన్ రోల్ అని, నయన్‌తో పోటీ పడే పాత్రని తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ కూడా రానుందట. ఇక నయనతార నటించిన తాజా చిత్రం 'నెత్రికన్' విడుదలకు సిద్దమవుతోంది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'అన్నాత్తే', విజయ్ సేతుపతి నటిస్తున్న 'కాతువాకుల రెండు కాదల్' చిత్రాలలో నటిస్తోంది.