May 5 2021 @ 13:06PM

శంకర్ - చరణ్ సినిమాలో సుదీప్..?

క్రియేటివ్ జీనియస్ శంకర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయో పాన్ ఇండియన్ సినిమా కన్నడ వెర్షన్‌కి సుదీప్‌ను ఫైనల్ చేసినట్టు ప్రచారమవుతోంది. ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ సినిమాని రూపొందించనున్నట్టు ఇటీవల ప్రకటించారు. ప్రతిష్టాత్మకంగా శంకర్ తెరకెక్కించబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జగుతోందని సమాచారం. అయితే ఈ సినిమాలో ఉన్న ఒక కీలక పాత్ర కోసం నాలుగు ప్రధాన భాషలకి నలుగు స్టార్స్‌ను నటింప చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, లేదా పవన్ కళ్యాణ్, హిందీలో సల్మాన్ ఖాన్, తమిళంలో విజయ్ సేతుపతి పేర్లతో పాటు కన్నడలో క్రేజీ స్టార్‌గా వెలుగుతున్న కిచ్చా సుదీప్‌ను ఈ సినిమాకి సంప్రదించారని తెలుస్తోంది. త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందట. సుదీప్ ఇప్పటికే ఈగ, బాహుబలి, సైరా సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును పొందాడు.