Abn logo
Nov 22 2020 @ 22:12PM

సూపర్‌స్టార్‌కి, తన కొడుక్కి ఉన్న కనెక్షన్‌ చెప్పిన సుధీర్‌ బాబు

Kaakateeya

హీరో సుధీర్‌ బాబు.. ఈ మధ్య సూపర్‌స్టార్‌ కృష్ణను బాగా సోషల్‌ మీడియాలో హైలెట్‌ చేస్తున్నారు. రీసెంట్‌గా సూపర్‌ స్టార్‌ కృష్ణ తనని చూస్తున్న ఫొటోని షేర్‌ చేసిన సుధీర్‌ బాబు.. తాజాగా తన కొడుకుకి, సూపర్‌స్టార్‌ కృష్ణకి ఉన్న కనెక్షన్‌ గురించి చెప్పుకొచ్చారు. విషయంలోకి వస్తే.. తన కొడుకు చరిత్‌ మానస్‌ పుట్టినరోజు, సూపర్‌ స్టార్‌ కృష్ణ వెడ్డింగ్‌ యానివర్సరీ ఒకేరోజు అని సుధీర్‌ బాబు తెలుపుతూ.. తన కుమారుడు.. అలాగే తన అత్తమామల వెడ్డింగ్‌ యానివర్సరీ కేక్‌ కటింగ్‌ ఫొటోలను ఆయన షేర్‌ చేశాడు. అంతేకాదు ఇదేదో యాధృచ్చికంగా జరిగిందని అనుకుంటారేమో.. అస్సలు కాదు. నేను మ్యాజిక్‌ని నమ్ముతాను.. అని సుధీర్‌ బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.



Advertisement
Advertisement