బెల్లం, చెక్కెర.. రెండింటిలో ఏది బెటర్‌?

ABN , First Publish Date - 2020-09-27T17:01:19+05:30 IST

పంచదార, బెల్లం... రెండూ తీపికి కేరాఫ్‌ అడ్రస్‌ లే. బెల్లంతో చేసే వంటకాలన్నీ పంచదారతోనూ చేయవచ్చు. అయితే రెండింటిలో ఏది మంచిది? అని ఎప్పుడైనా ...

బెల్లం, చెక్కెర.. రెండింటిలో ఏది బెటర్‌?

పంచదార, బెల్లం... రెండూ తీపికి కేరాఫ్‌ అడ్రస్‌ లే. బెల్లంతో చేసే వంటకాలన్నీ పంచదారతోనూ చేయవచ్చు. అయితే రెండింటిలో ఏది మంచిది? అని ఎప్పుడైనా ఆలోచించారా? చక్కెరలో అధికంగా కెలోరీలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. కానీ బెల్లం ఆరోగ్యంపై ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపించదు. పంచదారను తయారు చేసేటప్పుడు రసాయనాలు వాడతారు. దీని వల్ల పోషక విలువలు పోతాయి. అదే బెల్లాన్ని తయారు చేసేటప్పుడు మాత్రం రసాయనాలు అంతగా వాడరు. పంచదార ఎక్కువ తింటే బరువు పెరుగుతారు. అదే బెల్లం తింటే బరువు తగ్గుతారు. అయితే రంగు కోసం బెల్లానికి కూడా కాస్త రసాయనాలను కలుపుతారు. కాబట్టి రంగు వేయని బెల్లాన్ని కొనుక్కోవడం ఉత్తమం. బెల్లం తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. కాలేయ సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి సందేహం లేకుండా చక్కెరకు బదులు బెల్లాన్నే వాడడం ఉత్తమం. 

Updated Date - 2020-09-27T17:01:19+05:30 IST