ఈ అన్నంతో షుగర్‌ పెరగదట!

ABN , First Publish Date - 2020-03-17T06:38:06+05:30 IST

అన్నం అనగానే వణికిపోతారు కొందరు. ఎందుకంటే అది శరీరం బరువునూ శరీరంలో షుగర్‌ నిల్వల్నీ పెంచుతుంది. అయితే శ్రీలంకలోని కాలేజ్‌ ఆఫ్‌ కెమికల్‌ సైన్సెస్‌కు చెందిన...

ఈ అన్నంతో షుగర్‌ పెరగదట!

అన్నం అనగానే వణికిపోతారు కొందరు. ఎందుకంటే అది శరీరం బరువునూ శరీరంలో షుగర్‌ నిల్వల్నీ పెంచుతుంది. అయితే శ్రీలంకలోని  కాలేజ్‌ ఆఫ్‌ కెమికల్‌ సైన్సెస్‌కు చెందిన పరిశోధక బృందం ఓ కొత్త విధానం ద్వారా వరి అన్నంలోని క్యాలరీలను 50 శాతం దాకా  తగ్గించే ఒక విధానాన్ని కనుగొన్నది. 

ఇంతకూ ఆ విధానం ఏమిటంటే, అర కప్పు బియ్యం ఉడికించాలనుకుంటే మరిగే  నీళ్లల్లో ఒక టీ స్పూను కొబ్బరి నూనె వేయాలి. అన్నం అయ్యాక పిండిపదార్థంలో సహజంగా ఉండే సూక్ష్మాంశాల్లో మౌలికమైన మార్పు జరుగుతుంది. దీని వల్ల త్వరితంగా జీర్ణమయ్యే లక్షణాన్ని పిండి పదార్థం కోల్పోతుంది. సంప్రదాయ వంట విధానంతో పోలిస్తే, ఇలా వండడం వల్ల పిండి పదార్థం జీర్ణమయ్యే వేగం పది రెట్లు తగ్గుతోందని పరిశోధకులు గమనించారు. అంతిమంగా ఇది షుగర్‌ పెరగడాన్ని నివారించడమేగా!

Updated Date - 2020-03-17T06:38:06+05:30 IST