ఇద్దరి ప్రాణం తీసిన కరోనా, ఆర్థిక ఇబ్బందులు

ABN , First Publish Date - 2021-04-11T09:06:34+05:30 IST

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి తన కుమార్తెతో కలిసి శనివారం ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడ సత్యనారాయణపురంలో జరిగింది. జాగా రవి(40)కి భార్య భరణి, సహస్ర

ఇద్దరి ప్రాణం తీసిన కరోనా, ఆర్థిక ఇబ్బందులు

కుమార్తెతో సహా టెకీ ఆత్మహత్య


విజయవాడ, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి తన కుమార్తెతో కలిసి శనివారం ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడ సత్యనారాయణపురంలో జరిగింది. జాగా రవి(40)కి భార్య భరణి, సహస్ర (10) ఉన్నారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ పనిచేసిన రవికి కరోనా కారణంగా ఉద్యోగం పోయింది. కుటుంబంతో విజయవాడ వచ్చేశాడు. భార్య భరణికి డయాలసిస్‌ అవసరం కావడంతో గవర్నరుపేటలో తల్లి వద్ద ఉంటోంది. రవి తన కుమార్తెతో కలిసి ఉంటున్నాడు.


శనివారం ఉదయం ఆయన బావమరిది రవికి ఫోన్‌ చేయగా.. జవాబు లేకపోవడంతో తన కుమారుడ్ని ఇంటికి పంపించాడు. ఇంట్లో తండ్రీ కూతుళ్లు ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించారు. ఎంతో జీవితం ఉన్న సహస్రకు ఉరివేసినందుకు క్షమాపణ చెప్తూ, ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టు, తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదని, తన మూత్రపిండాలను భార్య భరణికి దానం చేయాలని లేఖలు రాసి, వాటిని గదిలో గోడలకు అతికించి చనిపోయాడు.

Updated Date - 2021-04-11T09:06:34+05:30 IST