యువకుడి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-07-31T05:32:24+05:30 IST

మం దస గౌడవీధికి చెందిన ఓ యువకుడు కుటుంబ కల హాలతో విరక్తి చెంది బొడ్డపాడు సమీపంలోని యాపోడు చెరువు జంక్షన్‌ వద్ద రైల్వేట్రాక్‌పై ఆత్మ హత్యాయత్నానికి శుక్రవా రం సిద్ధమయ్యాడు.

యువకుడి ఆత్మహత్యాయత్నం
యువకుడిని రైల్వేట్రాక్‌ నుంచి తీసుకొస్తున్న సర్పంచ్‌ మదన్‌

  ప్రాణాలు కాపాడిన బొడ్డపాడు సర్పంచ్‌ 

పలాస రూరల్‌: మం దస   గౌడవీధికి చెందిన ఓ యువకుడు  కుటుంబ కల హాలతో విరక్తి చెంది బొడ్డపాడు   సమీపంలోని యాపోడు చెరువు జంక్షన్‌ వద్ద రైల్వేట్రాక్‌పై ఆత్మ హత్యాయత్నానికి శుక్రవా రం సిద్ధమయ్యాడు. దూరం నుంచి గమనించిన బొడ్డపా డు సర్పంచ్‌ తామాడ మదన్‌ అప్రమత్తమై ఆ యువకుడ్ని ట్రాక్‌పై నుంచి పక్కకు తీసుకు వచ్చి జీవి తంపై అవగాహన కల్పించా డు. కష్టసుఖాలు తెలుసుకొని ముందుకుసాగాలని, కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోవడం సమంజసంకాదని అవగాహన కల్పించి ఆయన  ప్రాణాలను కాపాడారు. ఈ విషయం తెలుసుకున్న బాధితుడి కుటుంబసభ్యులతో పాటు మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు సర్పంచ్‌ మదన్‌ను అభినందించారు. 

 



Updated Date - 2021-07-31T05:32:24+05:30 IST