యువకుడి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-08-05T11:53:51+05:30 IST

ప్రేమ వ్యవహారంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.

యువకుడి ఆత్మహత్యాయత్నం

జీజీహెచ్‌(కాకినాడ),ఆగస్టు4: ప్రేమ వ్యవహారంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. కాకినాడ రూరల్‌ మండలం, వాకలపూడికి చెందిన 23ఏళ్ల వాసంశెట్టి రాజ్‌కుమార్‌  గైగోలుపాడులో వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. ప్రేమించిన యువతికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలియడంతో  యువకుడు మంగళవారం పురుగుల మందు తాగాడు.  108 వాహనంపై జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతున్నాడు. తిమ్మాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-08-05T11:53:51+05:30 IST