పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

ABN , First Publish Date - 2021-09-05T21:06:09+05:30 IST

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఆదివారం ఉగ్రవాద దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

కరాచీ : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఆదివారం ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. తెహరీక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. 


క్వెట్టా డిప్యూటీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ అజహర్ అక్రమ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ, క్వెట్టాలోని మస్టుంగ్ రోడ్డులో ఉన్న ఫ్రాంటియర్ కార్ప్స్ చెక్‌పోస్ట్‌పై ఆత్మాహుతి దాడి జరిగినట్లు తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. 20 మంది గాయపడగా, వీరిలో 18 మంది ఫ్రాంటియర్ కార్ప్స్  సెక్యూరిటీ సిబ్బంది అని, ఇద్దరు సాధారణ పౌరులని చెప్పారు. 


బలూచిస్థాన్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం, సోనా ఖాన్ చెక్‌పోస్ట్ సమీపంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. 


ఇదిలావుండగా, ఈ ఆత్మాహుతి దాడి తమ పనేనని తెహరీక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. 


Updated Date - 2021-09-05T21:06:09+05:30 IST