మెకానిక్ తప్పు చేశాడని జులుం ప్రదర్శించిన యజమాని.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-11-20T16:11:02+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోగల ఒక మొబైల్ ఫోను దుకాణంలో..

మెకానిక్ తప్పు చేశాడని జులుం ప్రదర్శించిన యజమాని.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోగల ఒక మొబైల్ ఫోను దుకాణంలో మెకానిక్‌గా పనిచేస్తున్న యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహం దగ్గర లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు ఆ మొబైల్ ఫోను దుకాణం యజమానిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. సూసైడ్ నోట్‌లో ఆ యువకుడు తాను చేసిన చిన్న తప్పుకు దుకాణం యజమాని తనను ఏకంగా 15 లక్షల రూపాయలు కట్టమంటున్నాడని, ఈ కారణంగానే తాను మనోవేదనతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. సర్కంఢా పోలీస్ స్టేషన్ హెడ్ పరివేష్ తివారీ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ తఖత్‌పూర్ పరిధిలోని లిమ్హీ నివాసి మృణేంద్ర తివారి(21) రాజీవ్ ప్లాజాలో ఏఆర్ కమ్యూనికేషన్‌లో మొబైల్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అశోక్ విహార్ ప్రాంతంలోని ఒక అద్దె గదిలో ఉంటున్నాడు. తాను ఇంటున్న ఇంట్లోనే మృణేంద్ర తివారి ఆత్మహత్య చేసుకున్నాడు. 


పక్కఇంటిలోని వారు దీనిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఈ విషయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు తెలిపారు. పోలీసులకు ఆ గదిలో సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. దీని ఆధారంగా ఏఆర్ కమ్యూనికేషన్‌ నిర్వాహకుడు నరేంద్ర మంగ్వానీపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. ఆ సూసైడ్ నోట్‌లో మృణేంద్ర.. తాను చేసిన చిన్నపాటి తప్పుకు యజమాని వేధింపులకు గురిచేశాడని, 15 లక్షల రూపాయలు ఇమ్మంటున్నాడని పేర్కొన్నాడు. అంత మొత్తంలో సొమ్ము తాను ఇచ్చుకోలేనని, చెప్పినా వినడం లేదని, ఈ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ఈ సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని ప్రశ్నించగా, తాను 15 లక్షల రూపాయలు అడగలేని తెలిపాడు. దుకాణంలో మృణేంద్ర చోరీ చేస్తుండగా అతనిని పట్టుకున్నానని తెలిపారు. దుకాణంలో చోరీ జరిగిన వస్తువులకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించమన్నానని తెలిపారు. 

Updated Date - 2021-11-20T16:11:02+05:30 IST