మనోవేదనతో వృద్ధుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-26T05:49:32+05:30 IST

బంగార్రాజుపేట గ్రామానికి చెందిన డి.నారాయణ (69) మనోవేదనకు గురై సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్టు హెడ్‌కానిస్టేబుల్‌ లక్ష్మణరావు తెలిపారు.

మనోవేదనతో వృద్ధుడి ఆత్మహత్య

డెంకాడ, జనవరి 25: బంగార్రాజుపేట గ్రామానికి చెందిన డి.నారాయణ (69) మనోవేదనకు గురై సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్టు హెడ్‌కానిస్టేబుల్‌ లక్ష్మణరావు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బంగార్రాజుపేట గ్రామానికి చెందిన నారాయణ అనే వృద్ధుడు నరాల బలహీనత, మూలవ్యాధితో గత కొన్నేళ్లుగా బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా ఫలితం కానరాలేదు. దీంతో మన స్తాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స కోసం జిల్లా కేంద్రాసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్‌ కానిస్టేబుల్‌ లక్ష్మణరావు తెలిపారు.

 

Updated Date - 2021-01-26T05:49:32+05:30 IST