నానమ్మ దగ్గరకు వెళ్తున్నా.. ఇదే నా చివరి సెల్ఫీ వీడియో..!

ABN , First Publish Date - 2021-10-21T14:02:33+05:30 IST

కొరియర్‌ బాయ్‌గా పని చేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో...

నానమ్మ దగ్గరకు వెళ్తున్నా.. ఇదే నా చివరి సెల్ఫీ వీడియో..!

హైదరాబాద్ సిటీ/జవహర్‌నగర్‌ : సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల, పోలీసుల వివరాల ప్రకారం.. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధి వెంకటేశ్వరకాలనీలో నివాసం ఉంటున్న ఆటో మల్లేశం కొడుకు అశోక్‌ (28)కు మూడేళ్ల క్రితం వివాహమైంది. ఇంకా సంతానం లేదు. కొరియర్‌ బాయ్‌గా పని చేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన అశోక్‌ సెల్ఫీ వీడియో తీసుకుంటూ మెడకు తాడు బిగించుకుని ‘నేను నానమ్మ దగ్గరకు వెళ్తున్నా. ఇదే నా చివరి వీడియో. వాట్సాప్‌ అన్‌లాక్‌ చేయడం లేదు. నేను నిజంగా ఉరేసుకున్నా చూడు’ అంటూ ఉరి వేసుకున్నాడు. ఈ వీడియోను స్నేహితుడికి పంపాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అశోక్‌ మృతికి కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

Updated Date - 2021-10-21T14:02:33+05:30 IST