Advertisement
Advertisement
Abn logo
Advertisement

అవమానభారంతో ఆత్మహత్య

మోతె, డిసెంబరు 3: మహిళా గిరిజన రైతు దాడి చేయడంతో ఓ వ్యక్తి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని నేరేడువాయిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.... గ్రామానికి చెందిన ధారమళ్ల ఉప్పయ్య (50) తనకున్న రెండు పశువులను రోజు మాదిరిగానే గత నెల 30వ తేదీన తన వ్యవసాయ పొలం వద్దకు తోలుకెళ్లాడు. సమీపంలోని గోపతండాకు చెందిన రైతు కొర్రా బుజ్జికి చెందిన కల్లంలోని ధాన్యాన్ని తిన్నాయి. దీంతో ఆగ్రహంతో కొర్ర బుజ్జి మృతుడు ఉప్పయ్యను నానాబూతులు తిడుతూ చెప్పుతో కొట్టింది. దీంతో అవమాన భారం భరించలేక ఇంటికి వెళ్లాక క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉప్పయ్య మృతి చెందాడు. మృతుడు ఉప్పయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొడుకు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. 


Advertisement
Advertisement