Advertisement

తెలుగు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చినా.. దృష్టంతా కోలీవుడ్ పైనే: ‘దృశ్యం 2’ భామ

‘బిగ్‌బాస్‌’ తమిళం తొలి సీజన్‌లో పాల్గొని తన నటనా ప్రతిభతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్న నటి సుజా వరుణి చిన్న గ్యాప్‌ తర్వాత మళ్ళీ వెండితెరపై కనిపించింది. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘దృశ్యం-2’ చిత్రాన్ని తెలుగులో హీరో వెంకటేష్‌ - మీనా జంటగా రీమేక్‌ చేశారు. ఇందులో సుజా వరుణి అద్భుతమైన పాత్ర పోషించి, అందరి ప్రశంసలు అందుకుంటోంది. ‘బిగ్‌బాస్‌’ తర్వాత పలు చిత్రాల్లో నటించిన సుజా వరుణి.. వివాహం చేసుకుని ఓ బిడ్డకు జన్మనివ్వడంతో చిత్ర పరిశ్రమకు కొంతకాలం దూరమైంది. 


ఇపుడు ‘దృశ్యం 2’లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మళ్ళీ ప్రేక్షకులకు దగ్గరవుతోంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఆమెకు పలు అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన రీఎంట్రీ ఒక తెలుగు చిత్రంలో చిన్నపాత్ర ద్వారా జరిగినప్పటికీ.. తన దృష్టంతా కోలీవుడ్‌పైనే ఉంటుందని ఆమె తాజాగా వ్యాఖ్యానించింది.


Advertisement