AP: పోలీసులా.. వైసీపీ కార్యకర్తలా?..: సుజనా చౌదరి

ABN , First Publish Date - 2022-01-26T18:02:20+05:30 IST

కర్నూలులో జరగిన సంఘటన రాజ్యంగ వ్యతిరేకమని బీజేపీ నేత సుజనా చౌదరి విమర్శించారు.

AP: పోలీసులా.. వైసీపీ కార్యకర్తలా?..: సుజనా చౌదరి

విజయవాడ: కర్నూలులో జరగిన సంఘటన రాజ్యంగ వ్యతిరేకమని, అనుమతులు లేకుండా మసీదు కడుతుంటే అడ్డుకున్నందుకు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేశారని బీజేపీ నేత సుజనా చౌదరి విమర్శించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర హోంమంత్రి తెలిసి తెలీకుండా మాట్లాడారని, శ్రీకాంత్ రెడ్డిపై సెక్షన్ 307 ఎలా పెట్టారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ మాత్రం అరాచక ప్రదేశ్‌గా మారిందన్నారు. ‘ఏపీలో పోలీసులా.. వైసీపీ కార్యకర్తలా’.. అన్నట్టు తయారయిందన్నారు. రిపబ్లిక్ డే నాడు ఏపీ విషయంలో బాధపడాల్సిన పరిస్ధితి ఉందని అనడానికి బాధపడుతున్నానన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వైసీపీ సరిగా వినియోగించుకోలేకపోతోందన్నారు.


ప్రతీ సమస్యను పరిష్కరించడానికి అప్పట్లోనే ఆలోచించి ప్రజాస్వామ్య పరిష్కారాలిచ్చారని, ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్య దేశం భారతదేశమని సుజనా చౌదరి కొనియాడారు. కోవిడ్ క్లిష్ట పరిస్ధితులలో కరోనా కట్టడికి ప్రధాని మోదీ చేసిన ప్రణాళికలు ప్రపంచం మెచ్చుకుంటోందన్నారు. 160 కోట్ల‌ వ్యాక్సినేషన్ భారత్‌లో చేశామన్నారు. బూస్టర్ డోస్ కూడా ఇస్తున్నామని సుజనా చౌదరి అన్నారు. 

Updated Date - 2022-01-26T18:02:20+05:30 IST