Abn logo
Aug 10 2021 @ 15:59PM

వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదు: పీతల సుజాత

అమరావతి: వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదని మాజీ మంత్రి, తెలుగుదేశం నేత పీతల సుజాత అన్నారు. మంగళవారం సుజాత మీడియాతో మాట్లాడుతూ.. దళితుల పట్ల సీఎం జగన్‌రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్ల వైసీపీ పాలనలో దళితులపై ఎన్నో అక్రమ కేసులు, వేధింపులు పెట్టిందని ధ్వజమెత్తారు. మంగళవారం టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం ప్రభుత్వ పిరికి పంద చర్య అన్నారు. డాక్టర్ సుధాకర్‌ను వేధించి చంపేశారని పీతల సుజాత అన్నారు.

అవినీతిని ప్రశ్నించిన డాక్టర్ అనితారాణి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. దళితులకు ఎవరు ఎంత మేలు చేశారో వైసీపీ ప్రభుత్వం చర్యకు రావాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి దళితులను ఓటుబ్యాంకుగానే చూస్తున్నారన్నారు.దళితుల పట్ల కక్షసాధింపు ఆపకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతామని వైసీపీ ప్రభుత్వాన్ని పీతల సుజాత హెచ్చరించారు.