నేటి తరం అగ్ర దర్శకుల్లో సుకుమార్ తన శిష్యులను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన నిర్మాతగా మారి వారితో సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘కుమారి 21 ఎఫ్’, ‘ఉప్పెన’, ‘18 పేజీస్’ చిత్రాలకు నిర్మాతల్లో ఒకరిగా సుకుమార్ వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సుకుమార్ టీమ్ నుండి మరో దర్శకుడు పరిచయం కాబోతున్నాడట. శ్రీకాంత్ మెగాఫోన్ పట్టనున్నాడు. ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నాడట. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించే అవకాశాలున్నాయని టాక్. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఈ సినిమాపై మరింత క్లారిటీ రానుంది.