Oct 23 2021 @ 20:43PM

బాలీవుడ్ బ్యూటీకి BMW CAR గిఫ్ట్‌గా ఇచ్చానంటోన్న క్రిమినల్! చిక్కుల్లో Nora Fatehi...

పలు ఆర్దిక, హవాలా, బెదిరింపు కేసుల్లో నిందుతుడుగా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ రోజుకొక షాకింగ్ విషయం బయటపెడుతున్నాడు. అతను ఇప్పటికే ఓ పాత కేసులో భాగంగా ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడితో పాటూ లీనా మారియా పాల్ అనే మరో దక్షిణాది నటి కూడా పలు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఆమెను కూడా పోలీసులు కొన్నాళ్ల క్రితం అరెస్ట్ చేశారు. అయితే, ప్రధాన నిందుతుడు సుఖేశ్ చంద్రశేఖర్ను ఈడీ అధికారులు పలుమార్లు ప్రశ్నిస్తుండటంతో అనేక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఢిల్లీలోని ఓ వ్యాపారవేత్త భార్యని బెదిరించి 200 కోట్లు వసూలు చేసిన కేసులో ప్రస్తుతం విచారణ సాగుతోంది... 


సుఖేశ్ చంద్రశేఖర్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న క్రమంలో బాలీవుడ్ యాక్టర్స్ నోరా ఫతేహి, జాక్విలిన్ ఫెర్నాండెజ్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. వారిని మొదట సాక్షులుగా మాత్రమే ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రశ్నించారు. కానీ, వారిద్దరి ప్రమేయం కేసులో అంతకంతకూ పెరుగుతుండటంతో మరింత లోతుగా ప్రశ్నించే ప్రయత్నాలు చేస్తున్నారు. నోరా ఫతేహి ఈడీ ముందు ఇప్పటికే మూడు సార్లు హాజరైంది. కానీ, జాక్విలిన్ మాత్రం నోటీసులకు స్పందించకుండా గైర్హాజరు అవుతూ వస్తోంది. 


ఒకవైపు ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తుండగానే, నోరా ఫతేహి కష్టాలు మరింత పెరిగిపోయేలా సుఖేశ్ చంద్రశేఖర్ కొత్త స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను ఓ ఖరీదైన బ్లాక్ బీఎండబ్ల్యూ కారుని నోరాకి గిఫ్ట్‌గా ఇచ్చినట్టు అధికారులకి తెలిపాడు. ఆ డబ్బు అతను ఢిల్లీలోని ఓ వ్యాపారి భార్యని బెదిరించటం ద్వారా సంపాదించినట్టు ఈడీ అనుమానిస్తోంది. అతడితో పాటూ నోరా, జాక్విలిన్ కూడా 200 కోట్ల రూపాయల చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, నోరా ఫతేహి కార్యదర్శి మాత్రం బీఎండబ్ల్యూ గిఫ్ట్ అనేది అబద్ధం అంటున్నాడు. నోరా స్వయంగా కూడా ఈడీకి తాను నిర్దోషినని చెప్పిందట. చూడాలి మరి, ముందు ముందు ఈ హవాలా, బెదిరింపుల కేసు జాకీ, నోరాకి ఎలాంటి తంటాలు తెచ్చి పెడుతుందో... 

Bollywoodమరిన్ని...