Abn logo
Dec 3 2020 @ 17:35PM

రైతులకు మద్దతు: ప్రకాశ్ సింగ్ బాదల్ బాటలో మరో నేత

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులకు రాజ్యసభ ఎంపీ, శిరోమణి అకాళీదళ్ (డెమొక్రాటిక్) చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా మద్దతు ప్రకటించారు. రైతులకు సంఘీభావంగా తన పద్మ భూషణ్ అవార్డును వెనక్కి ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. గతేడాది మార్చిలో సుఖ్‌దేవ్ పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. కాగా రైతులకు మద్దతుగా ఇవాళ శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నేత, మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ కూడా తన పద్మ భూషణ్ అవార్డును వెనక్కి ఇచ్చేసిన విషయం తెలిసిందే. ఆయన బాటలో రైతుల ఆందోళనకు మద్దతుగా సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా పద్మభూషణ్ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేసినట్టు ఎస్ఏడీ (డెమొక్రాటిక్) వర్గాలు వెల్లడించాయి. 

Advertisement
Advertisement
Advertisement