Jun 14 2021 @ 08:04AM

‘పుష్ప’.. బోట్ ఫైట్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటుందనే విషయాన్ని ఇటీవల ఓ సంద‌ర్భంలో నిర్మాత తెలిపారు. పాన్ ఇండియా రేంజ్ మూవీ కాబ‌ట్టి నిర్మాత‌లు ‘పుష్ప’ను అన్ కాంప్ర‌మైజ్డ్‌గా రూపొందిస్తున్నారు. ముఖ్యంగా యాక్ష‌న్ స‌న్నివేశాల విష‌యంలో ఆడియెన్స్‌ను క‌ట్టిప‌డేసేలా ప్లాన్ చేస్తున్న‌ట్లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. ఈ సినిమాలో బోట్ ఫైట్‌ను సుకుమార్ ప్లాన్ చేశార‌ట‌. టాలీవుడ్‌లో కొన్ని చిత్రాల్లో బోట్ ఫైట్స్ ఉన్నాయి. కానీ.. వాట‌న్నింటికంటే భిన్నంగా, రిచ్‌గా ఉండేలా చూస్తున్నార‌ట‌. కొవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ  చిత్రంలో ఫ‌హ‌ద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్‌పై పుష్ప చిత్రం తెర‌కెక్కుతోంది.