Jul 29 2021 @ 21:04PM

సుమంత్‌ పెళ్లి నిజం కాదట?

హీరో సుమంత్‌ రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త రెండు, మూడు రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే! పవిత్ర అనే అమ్మాయితో వివాహం జరగబోతుందని, పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని గాసిప్పులు వినిపించాయి. దీనిపై సుమంత్‌ ఓ వీడియో ద్వారా స్పందించారు. తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘‘నిజ జీవితంలో నేను మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన శుభలేఖ ప్రస్తుతం నేను నటిస్తున్న సినిమాకు సంబంధించింది.  పెళ్లి, విడాకులు నేపథ్యంలో సాగే సినిమా అది. ఆ షూటింగ్‌ నుంచి వెడ్డింగ్‌ కార్డ్‌ లీకైంది. త్వరలో ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ విడుదల చేస్తాం’’ అని తెలిపారు.