May 13 2021 @ 21:57PM

మహేష్-త్రివిక్రమ్ సినిమాలో సుమంత్

సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సర్కారు వారి పాట’ చిత్రం సెట్స్‌పై ఉండగానే.. సంచలన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ తన 28వ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన‌రోజైన మే 31న పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. అలాగే 2022 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా చిత్రాన్ని విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. తాజాగా ఈ చిత్రంలో అక్కినేని హీరో సుమంత్ ఓ కీలక పాత్ర చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. త్రివిక్రమ్ గత చిత్రం ‘అల వైకుంఠపురములో..’ కూడా యంగ్ హీరో సుశాంత్‌కు ఓ కీలక పాత్రను ఇచ్చారు. ఇప్పుడదే ఫార్ములాను మహేష్ సినిమాకు కూడా త్రివిక్రమ్ ఫాలో అవుతున్నాడని, సుమంత్ పాత్ర ఈ చిత్రానికి హైలెట్‌గా ఉండబోతుందనేలా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ‌(చిన‌బాబు) ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు.