వేసవిలో ఇలా..!

ABN , First Publish Date - 2021-04-26T17:36:36+05:30 IST

వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునే ఆహారంలోనూ, ధరించే దుస్తుల్లోనూ మార్పులు చేసుకోవాలి.

వేసవిలో ఇలా..!

ఆంధ్రజ్యోతి(26-04-2021)

వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునే ఆహారంలోనూ, ధరించే దుస్తుల్లోనూ మార్పులు చేసుకోవాలి. 


ఎక్కువ నీరు తాగాలి. వేసవిలో శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కాబట్టి తరచుగా నీరు తాగుతూ ఉండాలి. 

చెమట ద్వారా మినరల్స్‌ బయటకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తాజా పండ్లు, కూరగాయలు తీసుకుంటూ శరీరంలో ఎలక్రోలైట్స్‌ బ్యాలెన్స్‌ చేసుకోవాలి. 

వీలైనంత వరకు మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఉండాలి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే గొడుగు పట్టుకుని వెళ్లాలి. 

కేఫిన్‌, ఆల్కహాల్‌ ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి. వీటిల్లో ప్రిజర్వేటివ్స్‌, కలర్‌, షుగర్‌ ఉంటుంది. ఇవి అసిడిక్‌ గుణం కలిగి ఉండి డైయూరిటిక్స్‌గా పనిచేస్తాయి. చాలా సాఫ్ట్‌డ్రింక్‌ల్లో డైల్యూటెడ్‌ ఫాస్ఫారిక్‌ యాసిడ్‌ ఉంటుంది. వీటిని ఎక్కువ తీసుకుంటే రక్తంలో ఫాస్ఫారిక్‌ లెవెల్స్‌ పెరిగిపోతాయి.

వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి. సమోస, వడ, చిప్స్‌, బజ్జీలు వంటి పదార్థాలను తినకూడదు. 

తక్కువ ఆహారం ఎక్కువ సార్లు తీసుకోవాలి. బ్రేక్‌ఫా్‌స్టలో ఫ్రూట్‌ జ్యూస్‌ తీసుకోవాలి. పండ్లు క్రమంతప్పకుండా తినాలి.

మధ్యాహ్నం లంచ్‌లో సలాడ్స్‌ ఉండేలా చూసుకోవాలి. దోసకాయతో చేసిన సలాడ్‌ చల్లదనాన్ని అందిస్తుంది. దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.

ఎండలోకి వెళ్లివచ్చిన తరువాత మరీ చల్లగా ఉండే పానీయాలను, ఐస్‌క్రీమ్‌లాంటి పదార్థాలను తీసుకోవడం మంచిది కాదు.


Updated Date - 2021-04-26T17:36:36+05:30 IST