హైదరాబాద్‌లో ఉదయం ఎండ.. సాయంత్రం ఠండా..!

ABN , First Publish Date - 2021-04-13T16:04:15+05:30 IST

హైదరాబాద్‌ నగరంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి.

హైదరాబాద్‌లో ఉదయం ఎండ.. సాయంత్రం ఠండా..!

  • నగరంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు

హైదరాబాద్‌ : నగరంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భగ్గుమం టున్న భానుడు తర్వాత మబ్బుల చాటుకు వెళ్తున్నాడు. దీంతో నగరంలో ఒక్కసారిగా చల్లని వాతావరణం ఏర్పడి పలుచోట్ల తేలికపాటి జల్లులు కురుస్తుండడంతో గ్రేటర్‌ వాసులు ఎండతీవ్రత నుంచి ఉపశమనం పొందుతు న్నా రు. హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో తేలి కపాటి వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. రాగల రెండు రోజుల్లో నగరంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వారు పేర్కొన్నారు. కాగా, సోమవారం నగరంలో మొత్తంగా 35.6డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

Updated Date - 2021-04-13T16:04:15+05:30 IST