Abn logo
Apr 21 2021 @ 00:54AM

సమ్మర్‌ స్టయిల్‌

వేసవిలో వేడిని తట్టుకొని, ఒంటికి హాయినిచ్చే నయా కలెక్షన్‌ను తీసుకొచ్చింది ప్రముఖ బ్రాండ్‌ ‘డీఎల్‌ఎఫ్‌ ప్రోమెనేడ్‌’. నాణ్యతకు, మన్నికకే కాకుండా సౌకర్యవంతమైన వెరైటీలను అందించడంలో పేరుపొందిన ఈ బ్రాండ్‌... ఫ్యాషన్‌ ప్రియులను కూడా ఆకట్టుకొనేలా తాజా కలెక్షన్‌ను డిజైన్‌ చేసింది. ఏ ఈవెంట్‌కో వెళ్లినప్పుడు ప్రత్యేకంగా కనిపించాలన్నా... బ్యాచ్‌లర్‌ పార్టీలో ట్రెండీ టచ్‌తో మెరిసిపోవాలనుకున్నా... లేదంటే స్విమ్మింగ్‌ పూల్‌లో క్రేజీ లుక్స్‌తో ఆకట్టుకోవాలనుకున్నా... సందర్భం ఏదైనా సరే... ఆకర్షణీయమైన రంగులు, డిజైన్లలో ఈ అవుట్‌ఫిట్స్‌ ఉన్నాయి.


2021 కలర్‌ ట్రెండ్స్‌కు లవ్‌ లెటర్‌గా అభివర్ణిస్తున్న ఈ కలెక్షన్‌కు ‘సన్‌ కిస్సింగ్‌’ అని పేరు పెట్టింది సంస్థ. ఒంటికి మృదువైన స్పర్శనిచ్చే మెత్తని వస్త్రంతో దీన్ని రూపొందించింది. వీటికి జతగా స్నీకర్స్‌ను కూడా అందిస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement