Abn logo
May 6 2021 @ 03:46AM

కోర్టులకు ముందుగానే వేసవి సెలవులు

అమరావతి, మే 5 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో హైకోర్టుతో పాటు దిగువ న్యాయస్థానాలకు మరింత ముందుగా వేసవి సెలవులను ప్రకటించారు. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైకోర్టుకు ఈ నెల 10 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులుగా పేర్కొన్నారు. మొదట ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 14 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో మరో మూడు రోజులు అదనంగా సెలవులు ఇచ్చారు. ఇందుకు బదులుగా అక్టోబర్‌ 23 (శనివారం)తో పాటు సెలవులుగా ప్రకటించిన నవంబర్‌ 3, 5 తేదీలను పనిదినాలుగా పేర్కొన్నారు. మరోవైపు దిగువ న్యాయస్థానాల్లోని అన్ని కోర్టులు, సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులకు గతంలో ఈ నెల 14 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. తాజాగా ఈ నెల 10 నుంచి జూన్‌ 8 వరకు సెలవులు ఇచ్చారు. 

Advertisement