నిర్మాత ప్రాణాల కోసం సాయం కోరుతున్న హీరోయిన్‌

‘కాదలిల్‌ విళుందేన్‌’, ‘మాసిలామణి’, ‘యాదుమాగి’, ‘వంశం’, ‘తిరుత్తణి’, ‘నీర్‌పరవై’, ‘తెరి’, ‘తొండన్‌’, ‘సిల్లుకరుప్పట్టి’ వంటి అనేక చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ సునైనా. ఆమె స్నేహితుడు, సినీ నిర్మాత అవినాష్‌ ప్రస్తుతం కరోనా వైరస్‌ సోకి ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేక అవినాష్‌ కుటుంబ సభ్యులు కష్టపడుతున్నారు. దీంతో అవినాష్‌ ప్రాణాలను కాపాడేందుకు తమకు తోచిన విధంగా ఆర్థికసాయం చేయాలని సునైనా ప్రాధేయపడుతోంది. ఇదే విషయమై ఆమె తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు చేసింది. 


‘‘సోషల్‌ మీడియాలో ఇలాంటి వీడియోలను నేను పోస్టు చేయను. కానీ, అత్యవసరం కావడంతో ఈ వీడియోను పోస్ట్ చేశాను. నా స్నేహితుడు అవినాష్‌ కరోనా వైరస్‌ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత నెల రోజులుగా ఆయన ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఇప్పటికే భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు చేశారు. కానీ, ఇప్పుడు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అభినేష్‌కు మెరుగైన వైద్యం చేయించేందుకు వీలుగా ఎవరైనా ఆర్థికసాయం చేయాలని ప్రాధేయపడుతున్నాను. నేను కూడా కరోనా వైరస్ బారినపడి కోలుకున్నాను. అందువల్ల ఆ బాధ నాకు బాగా తెలుసు. మీరు చేసే ప్రతి చిన్న సాయం ఆయనకు పెద్దసాయమే. మీకు తోచినంతగా సాయం చేసి అవినాష్‌ను కాపాడాలని ప్రార్థిస్తున్నాను’ అని విజ్ఞప్తి చేసింది. 


Advertisement