జాతి సమానత్వానికి గూగుల్ మద్దతు.. మీరు ఒంటరి కాదంటూ సుందర్ పిచై ట్వీట్!

ABN , First Publish Date - 2020-06-01T16:33:24+05:30 IST

జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతి యువకుడిని శ్వేత జాతి పోలీసు అధికారి కాలితో తొక్కి చంపిన నేపథ్యంలో అమెరికాలో నిరసనలు తారస్థాయికి చేరాయి. అమెరికా వ్యా

జాతి సమానత్వానికి గూగుల్ మద్దతు.. మీరు ఒంటరి కాదంటూ సుందర్ పిచై ట్వీట్!

వాషింగ్టన్: జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతి యువకుడిని శ్వేత జాతి పోలీసు అధికారి కాలితో తొక్కి చంపిన నేపథ్యంలో అమెరికాలో నిరసనలు తారస్థాయికి చేరాయి. అమెరికా వ్యాప్తంగా దాదాపు 25 నగరాల్లో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి.. జార్జి ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్.. జాతి సమానత్వానికి మద్దతు పలికింది. ఈ మేరకు గూగుల్ సీఈఓ సుందర్ పిచై.. ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. జాత్యహంకారానికి బలైపోయిన జార్జి ఫ్లాయిడ్ లాంటి వారిని స్మరించుకుంటూ, నల్లజాతియూలకు సంఘీభావంగా.. జాతి సమానత్వానికి మద్దతు తెలుపుతూ అమెరికాలో గూగుల్, యూట్యూబ్ హోం పేజీలను మార్చుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆవేదనతో జాతి సమానత్వం కోసం పోరాడేవారు ఒంటరి కాదని.. వారికి తమ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. 




Updated Date - 2020-06-01T16:33:24+05:30 IST