ఆదివారం అంబర్‌పేట్‌లో.. సోమవారం పాతబస్తీలో ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , First Publish Date - 2021-07-31T17:03:12+05:30 IST

బోనాల ఉత్సవాలు, ర్యాలీల సందర్భంగా నగరంలో భారీ బందోబస్తును ఏర్పాటు..

ఆదివారం అంబర్‌పేట్‌లో.. సోమవారం పాతబస్తీలో ట్రాఫిక్‌ ఆంక్షలు

  • బోనాల ఉత్సవాలకు భారీ బందోబస్తు


హైదరాబాద్‌ సిటీ : బోనాల ఉత్సవాలు, ర్యాలీల సందర్భంగా నగరంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. గోల్కొండ, సికింద్రాబాద్‌ మహంకాళి బోనాలు ప్రశాంతంగా జరిగినట్టే పాతనగర బోనాలు కూడా ప్రశాంతంగా ముగుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పాతనగరంలోని అక్కన్న మాదన్న, సింహవాహిని, అంబర్‌పేట్‌లోని మహంకాళి ఆలయాలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలలో బోనాల పూజలు, ర్యాలీలు కొనసాగుతాయన్నారు. దీనికోసం ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టడంతో పాటు ప్రతి ఆలయం వద్ద ప్రత్యేక సిబ్బందిని కేటాయించి పర్యవేక్షిస్తున్నామని సీపీ అన్నారు. సోమవారం పలుప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని తెలిపారు.  లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 వరకు పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయి.

Updated Date - 2021-07-31T17:03:12+05:30 IST