Abn logo
Oct 14 2021 @ 17:03PM

ఇక చార్మినార్‌ వద్ద కూడా ‘ సండే ఫన్‌ డే’

హైదరాబాద్‌: ఇక నుంచి పాతబస్తీలోని చార్మినార్‌ వద్ద కూడా ప్రతి ఆదివారం ‘ సన్‌ డే ఫన్‌ డే’ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.టాంక్‌బండ్‌ పై ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సన్‌డే ఫన్‌డేకు విశేష స్పందన లభిస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు టాంక్‌బండ్‌పైకి వచ్చి పిల్లలతో హాయింగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో పాతబస్తీ చార్మినార్‌ వద్ద కూడా సన్‌డే ఫన్‌డే నిర్వహించాలని విజ్ఞప్తులు వస్తున్నాయని అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం అరవింద్‌ కుమార్‌తో పాటు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌, ఎంపి అసదుద్దీన్‌ ఓవైసీ తదితరులు చార్మినార్‌ను సందర్శించి ఇక్కడి పరిస్థితులను పరిశీలించారు.


సండే ఫన్‌ డే ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈసందర్భంగా కల్చరల్‌ ఈవెంట్‌లతో పాటు పార్కింగ్‌ ఏర్పాట్లను వారు పరిశీలించారు. చార్మినార్‌ వద్ద కూడా సన్‌డే ఫన్‌డే నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌, ఎంపీ అసదుద్దీన్‌ సూచించినట్టు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగా స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ తెలిపారు. ఈ విషయంలో ప్రజలు కూడా సల హాలు, సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో చార్మినార్‌ వద్ద కూడా సన్‌డే ఫన్‌ డే నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. 

ఇవి కూడా చదవండిImage Caption